ASR: కూనవరం పంచాయతీలో ప్రజా ప్రతినిధులు, సిబ్బంది కుమ్మక్కై లక్షల రూపాయలు అక్రమంగా డ్రా చేశారని ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి శ్రీను ఆరోపించారు. అవినీతికి ఆధారాలున్నా అధికారులు చర్యలు తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై తక్షణం విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరుతూ జిల్లా పంచాయతీ అధికారి కోటేశ్వరరావుకు శనివారం ఫిర్యాదు చేశారు.