ASR: అరకులోయ మండలం బటివలసలో శుక్రవారం రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను టీడీపీ అరకు ఇంఛార్జ్ సియ్యారి దొన్ను దొర రైతులకు పంపిణీ చేశారు. భూమి యజమాని ఫోటో, రాజముద్రతో పాస్ పుస్తకాలు ఉండాలన్న రైతుల కోరికను సీఎం చంద్రబాబు నెరవేర్చారని ఇది రైతుల ఆత్మగౌరవానికి నిదర్శనమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శ్రీనివాసరావు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.