కోనసీమ: వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఈ నెల 16వ తేదీ నుంచి ధనుర్మాసం ఉత్సవాలు నిర్వహిస్తామని ఆలయ డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్యచంద్రరావు తెలిపారు. నెల రోజులు పాటు ఈ ఉత్సవాలు జరుగుతాయని, దీనిలో భాగంగా ప్రతినిత్యం స్వామివారికి సుప్రభాత సేవతో పాటు పలు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.