BPT: అద్దంకి రెవెన్యూ డివిజన్ జిల్లా ఆదాయానికి వెన్నెముకగా మారనుంది. బల్లికురవ గ్రానైట్ క్వారీలు, దొనకొండ పారిశ్రామిక ప్రాంతం, పత్తి, మిర్చి పంటల మార్కెట్ సెస్ ద్వారా ప్రభుత్వానికి భారీ రాబడి రానుంది. అద్దంకి, దర్శిలలో రిజిస్ట్రేషన్లు, వాణిజ్య పన్నుల ద్వారా ఈ డివిజన్ కాసుల వర్షం కురిపిస్తుందని స్థానికులు ఆశిస్తున్నారు.