ATP: గుత్తి బీసీ కాలనీకి చెందిన ఓబులేశ్ రెడ్డి స్కూటీ డిక్కీలో పెట్టిన రూ.6లక్షలు చోరీకి గురయ్యాయి. అప్పు చెల్లించేందుకు డబ్బు తీసుకుని వెళ్తూ మధ్యలో అయ్యప్ప ఆలయానికి వెళ్లిన తర్వాత తిరిగి వచ్చి చూడగా డిక్కీ తెరచి ఉండటాన్ని గమనించాడని చెప్పారు. నగదు కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఓబులేశ్ రెడ్డి తెలిపారు.