కడప: రాష్ట్రస్థాయి భగవద్గీత శ్లోకాల పఠనం పోటీల్లో ప్రొద్దుటూరుకు చెందిన కాత్యాయిని ప్రథమ బహుమతి సాధించింది. స్థానిక పాఠశాలలో 1వ తరగతి చదువుతున్న కాత్యాయినిని మంగళవారం పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది అభినందించారు. రూ.10 వేలు నగదు బహుమతి, ప్రశంసా పత్రం పొందినట్లు తెలిపారు. కార్యక్రమంలో HM జ్యోతి, రిటైర్డ్ HM కాశీ ప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు.