SKLM: పాతపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన రెండు వేర్వేరు దాడి కేసుల్లో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషయాన్ని ఎస్సై మధుసూదన్ సోమవారం వెల్లడించారు. సెప్టెంబర్ 25న పెట్రోల్ బంక్ వద్ద రాయి దాడి, అక్టోబర్ 26న మామిడిపల్లి ఫంక్షన్లో కత్తి దాడి కేసుల్లో నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు ఎస్ఐ తెలిపారు.