NLR: విడవలూరు మండలంలోని విడవలూరు రైతు సేవా కేంద్రంలో మంగళవారం ‘పొలం పిలుస్తుంది’ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి వెంకటకృష్ణయ్య మాట్లాడుతూ.. వర్షాలను చూసుకొని రైతులందరూ వరి నాట్లు వేసుకోవాలని సూచించారు. అన్ని రైతు సేవా కేంద్రాల వద్ద యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నట్లు పేర్కొన్నారు.