E.G: ఈ నెల 15న రాజమహేంద్రవరం మోడల్ కెరీర్ సెంటర్లో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి హరిచంద్ర ప్రసాద్ గురువారం తెలిపారు. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రాజమండ్రి అర్బన్ నియోజకవర్గంలోని మోడల్ కెరీర్ సెంటర్ ప్రాంగణంలో ఉదయం 10 గంటలకు జాబ్ మేళా ప్రారంభమవుతుందన్నారు. 10వ తరగతి ఆపై చదివి, 19-40 ఏళ్ల లోపు వయసున్న వారు అర్హులన్నారు.