కోనసీమ: జిల్లా వ్యాప్తంగా ఆదివారం అన్ని పోలీస్ స్టేషన్లలో రౌడీషీటర్లకు ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించారు. జిల్లాలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చూడటమే లక్ష్యంగా ఈ కార్యక్రమం జరిగింది. పాత నేర చరిత్రను పక్కనపెట్టి, సన్మార్గంలో నడవాలని పోలీసులు వారిని హెచ్చరించారు. ఎవరైనా అసాంఘిక కార్య కలాపాలకు పాల్పడితే పీడీ యాక్ట్ వంటి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.