W.G: వైసీపీ ప.గో.జిల్లా ఐటీ వింగ్ జిల్లా అధ్యక్షుడిగా రెండవ సారి నరసాపురానికి చెందిన బుడితి సుమన్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా సుమన్ మంగళవారం మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం చేసే ప్రజా వ్యతిరేక పాలనపై నిరంతరం ప్రశ్నిస్తూ వైసీపీ పోరాటం చేస్తుందన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు కూటమి ప్రభుత్వానికి గుర్తు చేస్తూ ఉంటామని ఆయన అన్నారు.