WG: భీమవరం జీవీఆర్ మున్సిపల్ డైలీ కూరగాయల మార్కెట్‌ను మంగళవారం జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. కూరగాయల షాపులు యజమానులతో మాట్లాడారు. అధిక ధరలకు కూరగాయలను అమ్మే వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. మార్కెట్ అంతా పరిశుభ్రంగా ఉండాలని ఎక్కడపడితే అక్కడ కూరగాయల వేస్ట్‌ను పారవేయకుండా, ఒకచోట ఉంచాలని అన్నారు.