VSP: పీఎంపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో మతిస్థిమితం సరిగ్గా లేని ఒక మహిళ కనిపించట్లేదని ఇటీవల కేసు నమోదు అయ్యింది. దర్యాప్తులో భాగంగా పీఎంపాలెం పోలీసులు ఆమె కోసం విస్తృతంగా గాలించి ఆచూకీ కనుగొన్నారు. సదరు మహిళను ఆమె కుటుంబ సభ్యలకు మంగళవారం క్షేమంగా అప్పగించారు.