W.G: గోదావరి డెల్టాకు మే 31 నుంచే సాగునీరు విడుదల చేస్తామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. శనివారం పాలకొల్లు క్యాంపు కార్యాలయంలో ఇరిగేషన్ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. జిల్లాలో రూ. 27.34 కోట్లతో మంజూరైన 492 పనుల్లో ప్రస్తుతం 241 పనులు పురోగతిలో ఉన్నాయని అధికారులు వివరించారు.