ATP: రోడ్డు ప్రమాదంలో గాయపడిన కర్ణాటకకు చెందిన శ్రేయాస్ అనే యువకుడిని కాపాడి స్థానిక వైద్యులు, అవుట్ పోస్ట్ పోలీసులు మానవత్వం చాటుకున్నారు. గార్లదిన్నె వద్ద జరిగిన ప్రమాదంలో గాయపడిన అతడిని 108 సిబ్బంది అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అవుట్ పోస్ట్ ఎస్ఐ త్రిలోక్ నాథ్, హెడ్ కానిస్టేబుల్ స్వామి దగ్గరుండి వైద్య పరీక్షలు చేయించారు.