W.G: జిల్లాలో పెద్ద ఎత్తున వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత కార్యక్రమాలను నిర్వహించాలని జేసీ రాహుల్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ప్రతి నెల 3వ శనివారం పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో ప్రభుత్వ సంస్థలలో స్వచ్ఛ ఆంధ్ర దినోత్సవంగా పాటించాలన్నారు. వ్యక్తిగత, సమాజ పరిశుభ్రత కార్యక్రమాలను జిల్లా అంతట నిర్వహించాలన్నారు.