W.G: ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో అందిన అర్జీలను సత్వర పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ నాగరాణి అన్నారు. సోమవారం కలెక్టరేట్లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పలు ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి 182 ఫిర్యాదులను స్వీకరించారు. అలాగే అర్జీలు పునరావృతం కాకుండా నాణ్యతతో పరిష్కరించాలన్నారు.