GNTR: సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు అజయ్ కుమార్ గుంటూరు కొత్తపేట కార్యాలయంలో జరిగిన సమావేశంలో మాట్లాడారు. రైతులకు ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి చంద్రబాబు అమలు చేయలేదని ఆయన విమర్శించారు. పీపీపీ విధానానికి వ్యతిరేకంగా ఈ నెల 18న మెడికల్ కళాశాలల వద్ద, రైతు సమస్యలపై ఈనెల 10న మార్కెట్ యార్డుల వద్ద నిరసనలు, ధర్నాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.