TPT: రాజకీయంలో తన విజయాలకు శ్రీవేంకటేశ్వర స్వామే కారణమని చంద్రబాబు అన్నారు. తిరుపతిలో ఆయన మాట్లాడుతూ.. ‘ఈ రాష్ట్రానికి నేను ఇంకా ఏదో చేయాలనే అలిపిరి వద్ద నన్ను దేవుడు కాపాడాడు. మల్లెమడుగు, బాలాజీ రిజర్వాయర్లను త్వరలో పూర్తి చేస్తాం. కళ్యాణి డ్యాం మీదుగా హంద్రీ-నీవా నీటిని తిరుమల శ్రీవారి పాదాల వరకు తీసుకెళ్తామన్నారు.