SKLM: కోటబొమ్మాళి మండల జర్జంగి హైవే పై శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకి చెందిన కె చరణ్ సతీశ్ నాగేంద్ర (35) అనే డ్రైవర్ మృతి చెందాడు. నిద్రమత్తులో వాహనం కల్వర్టు పైకి దూసుకెల్లడంతో ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.