TPT: పాకాలలో బాలాజీ రైల్వే డివిజన్ సాధన సమితి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. రైల్వే ఇన్స్టిట్యూట్లో జరిగిన సభలో వక్తలు మాట్లాడుతూ.. బాలాజీ రైల్వే డివిజన్ ఏర్పాటులో సీఎం జోక్యం చేసుకుని కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. పాకాలను రైల్వే హబ్‌గా అభివృద్ధి చేసి ఎలక్ట్రిక్ లోకో షెడ్, ట్రైనింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.