TPT: తిరుపతి నగరం అభివృద్ధి దిశగా వేగంగా ముందుకు సాగుతోందని తుడా ఛైర్మన్ డాలర్ దివాకర్ రెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా స్వర్ణముఖి నది ప్రక్షాళనలో భాగంగా డ్రోన్ సర్వే పూర్తి అయ్యిందని, త్వరలో పనులు ప్రారంభించనున్నట్లు ఆయన చెప్పారు. అదేవిధంగా వినాయక సాగర్, అవిలాల చెరువులను అభివృద్ధి చేసి నగరానికి శాశ్వత నీటి సరఫరా కల్పించే దిశగా చర్యలు చేపడుతున్నామని దివాకర్ రెడ్డి స్పష్టం చేశారు.