GNTR: నగరంపాలెం పోలీసులు నిర్వహించిన ప్రత్యేక దాడుల్లో గంజాయి విక్రయిస్తున్న ఆరుగురు నిందితులను ఆదివారం అరెస్ట్ చేశారు. వీఐపీ రోడ్డులోని ఖాళీ స్థలంలో జరిగిన ఈ దాడిలో వారి నుంచి 2 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని, ఎన్డీపీఎస్ కేసు నమోదు చేశారు. అరెస్ట్ అయిన వారిలో పలువురిపై గతంలో దోపిడీ కేసులు కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.