కృష్ణా: రామన్నపూడి గ్రామంలో కోడి పందేలు, జూదం వంటి అక్రమ కార్యకలాపాలను నివారించేందుకు ఎస్సై చంటిబాబు ముందస్తు చర్యలలో భాగంగా అవగాహన ఫ్లెక్సీను శనివారం ఏర్పాటు చేశారు. సంక్రాంతి నేపధ్యంలో కోడి పందేలు, జూదం వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలు నిర్వహించకుండా ప్రజలు సహకరించాలన్నారు. వీటిలో పాల్గొన్నా, నిర్వహించినా చట్టప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.