అన్నమయ్య: రాజంపేట మండలం జాతీయ రహదారి తాళ్లపాక సమీపంలోని బైపాస్ వై జంక్షన్ వద్ద మంగళవారం రెండు బైకులు ఢీకొన్న ఘటనలో వృద్ధుడు తీవ్రంగా గాయపడ్డాడు. కొత్త బోయినపల్లి వద్ద నుంచి ఎలక్ట్రికల్ బైక్పై వస్తున్న వృద్ధుడిని రాజంపేట నుంచి వెళుతున్న యువకుడు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని, యువకుడికి స్వల్ప గాయాలు అయ్యాయని స్థానికులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.