E.G: ఈ నెల 11 తేదీ నుంచి 25 వరకు అటల్ బిహారీ వాజ్ పేయి శతజయంతి సుపరిపాలన దినోత్సవం నిర్వహిస్తున్నట్లు అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తెలిపారు. మంగళవారం రాజమండ్రి బీజేపీ కార్యాలయం వద్ద ఆయన మాట్లాడారు. వాజపాయి అజాత శత్రువు, 25 పార్టీలతో అలయన్స్ నడపడం సాధారణ విషయం కాదన్నారు. దేశంలో అనేక సంస్కరణలు చేసిన నాయకుడు వాజ్ పేయి అని కొనియాడారు.