W.G: ఆకివీడు పోలీస్ స్టేషన్లో శనివారం రాత్రి అదనపు కట్నం వేధింపుల కేసు నమోదైంది. ఆకివీడు (M) చినకాపవరం గ్రామానికి చెందిన పెరికల లక్ష్మీ దుర్గను ఆమె భర్త మణికంఠ, అతని కుటుంబ సభ్యులు అదనపు కట్నం కోసం మానసికంగా, శారీరకంగా వేధింపులకు గురి చేస్తున్నారని సమాచారం. బాధితురాలు ఇచ్చిన రాతపూర్వక ఫిర్యాదుతో వారిపై కేసు నమోదు చేసినట్లు SI హనుమంతు నాగరాజు తెలిపారు.