CTR: చౌడేపల్లె మండలంలోని శెట్టిపేట పంచాయితీ ఎర్రపల్లెలో వెలసిన శ్రీ బసవేశ్వర స్వామి ఆలయంలో శనివారం మాఘమాసపు తొలివారం పూజలను వేడుకగా నిర్వహించారు. మహిళలు వేకువజామున ఆలయం వద్దకు చేరుకొని ఆలయంను శుద్ధి చేసి స్వామి వారి దంపతులకు ప్రత్యేక పూజలు చేసి నైవేద్యం సమర్పించారు. వర్షాలు, పంటలు బాగా పండాలని, వృద్ధి చెందాలని కోరుతూ స్వామివారికి మొక్కులు చెల్లించారు.