PPM: వీరఘట్టం మండలం తలవరం కూడలి వద్ద ఆదివారం రాత్రి రెండు ఆటోలు ఢీకొన్నాయి. అటుగా వెళ్తున్న ఎమ్మెల్యే జయకృష్ణ అది చూసి వెంటనే తన వాహనాన్ని నిలిపివేసి క్షతగాత్రులకు స్వయంగా ఫస్ట్ ఎయిడ్ చేశారు. అంబులెన్స్ సిబ్బందికి సమాచారం అందించి పాలకొండ ఏరియా ఆసుపత్రికి తరలించారు. దీంతో ఎమ్మెల్యేను పలువురు అభినందించారు.