CTR: జిల్లాలో డాక్టర్ అంబేద్కర్ గురుకులాల్లో 5వ తరగతి, ఇంటర్మీడియట్ ప్రవేశాలకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు APSWERI జిల్లా సమన్వయ అధికారి పద్మజ తెలిపారు. పలమనేరు బాలికల గురుకుల పాఠశాలలో ఈనెల 26న 5వ తరగతి విద్యార్థులకు ఉదయం 10 గంటలకు, 29న ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఉదయం 10 గంటలకు కౌన్సెలింగ్ ఉంటుందన్నారు.