ELR: టీ.నర్సాపురంలో కోడిపందాల స్థావరాలపై పోలీసులు మెరుపు దాడి చేశారు. సోమవారం టీ.నర్సాపురం మండలం మర్రిగూడెం గ్రామ శివారులో కోడిపందాలు నిర్వహిస్తున్నారన్న సమాచారంతో ఎస్సై జయబాబు తన సిబ్బందితో దాడి చేశారు. కోడి పందాలు, జూదం నిర్వహిస్తున్న 8 మందిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు.