E.G: రాజమండ్రిలో APSEB గెస్ట్ హౌస్ నందు ఖేలో ఇండియా ఉమెన్స్ లీగ్ -2025 రాష్ట్ర స్థాయి మహిళల బాక్సింగ్ పోటీలు మంగళవారం ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ప్రారంభించారు. మహిళలలో దాగి ఉన్న కళను, ప్రతిభను వెలికితీయడమే కాకుండా దేశానికి ప్రతిభావంతులైన క్రీడాకారులను అందించడంలో మెరుగైన అవకాశాలున్నాయన్నారు.