KDP: కడప మున్సిపల్ కార్పొరేషన్ డివిజన్ల డీలిమిటేషన్ ముసాయిదాపై మాజీ మేయర్ పాక సురేశ్ కుమార్ ఏసీపీ మునిరత్నంకు అభ్యంతరాలు సమర్పించారు. సహజ సరిహద్దులు, జనాభా సమతుల్యతను పక్కన బెట్టి ఈ విభజన జరిగిందన్నారు. ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా మార్పులు చేయాలని ఆయన కోరారు. వైసీపీ నాయకులు రెడ్డి వర కుమార్, ఈటె రామచంద్ర ఇందులో పాల్గొన్నారు.