GNTR: తెనాలి పరిధిలోని జగ్గడిగుంటపాలెం టిడ్కో గృహ సముదాయాలను మున్సిపల్ కమిషనర్ రామ అప్పలనాయుడు బుధవారం ఉదయం సందర్శించారు. అక్కడ నివసిస్తున్న ప్రజలతో మాట్లాడి ఇబ్బందులను తెలుసుకున్నారు. స్థానికంగా ఉన్న పలు సమస్యలను వారు కమిషనర్‌కు తెలియజేశారు. పారిశుద్ధ్యం మెరుగుపరచాలని, మంచినీరు సక్రమంగా అందేలా చూడాలని సిబ్బందికి కమిషనర్ సూచించారు.