కోనసీమ: జిల్లా ఐ అండ్ పీఆర్ అధికారి శ్రీనివాసుపై శనివారం రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్‌లో ప్రైవేట్ కళాశాలకు చెందిన కొంతమంది విద్యార్థులు దాడి చేశారు. ఈ దాడిలో శ్రీనివాస్ తీవ్రంగా గాయపడ్డారు. బాధితుడు దీనిపై ప్రకాశ్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. గాయపడిన శ్రీనివాస్ ఆసుపత్రిలో చికితపొందుతున్నారు