KRNL: వెల్దుర్తి మండలంలోని కలుగొట్ల గ్రామంలో కరెంట్ బిల్లు చెల్లించమని అడిగినందుకు విద్యుత్ ఉద్యోగి హరినాథ్‌పై గ్రామస్థుడు శివనాయుడు దాడి చేశాడు. ఈ ఘటనలో శివనాయుడు పలు ట్రాన్స్ ఫార్మర్ ఫ్యూజ్‌లు, బుషింగ్ రాడ్‌ను ధ్వంసం చేసి విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగించాడు. ఈనెల 9న జరిగిన ఈ ఘటనపై గురువారం హరినాథ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.