GNTR: గత వైసీపీ ప్రభుత్వంలో పొన్నూరు పట్టణ స్వయం సహాయక సంఘాలలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ఆరోపించారు. మున్సిపల్ కార్యాలయంలో శనివారం మెప్మా (MEPMA) సిబ్బందితో జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. గతంలో బినామీ పేర్లతో ఫేక్ గ్రూపుల క్రియేట్ చేసి లోన్లు తీసుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.