ASR: గిరిజన రోగులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పొద్దు బాలదేవ్ డిమాండ్ చేశారు. అరకు మండలం బస్కి, జాకరవలస గ్రామాలకు చెందిన 20మంది చిన్నారులు జ్వరం, కళ్ల కలకలు, దురదలు, వాంతులతో బాధపడుతూ అరకు ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిని మంగళవారం గిరిజన సంఘం నేతలు పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు.