E.G: నిడదవోలు రూరల్ మండలం జీడిగుంట గ్రామంలో డా. బి.ఆర్. అంబేద్కర్ విగ్రహాన్ని పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఆవిష్కరించి ఘన నివాళులు అర్పించారు. భారతదేశానికి అత్యుత్తమ రాజ్యాంగాన్ని అందించిన అంబేద్కర్ ప్రపంచ స్థాయి మేధావి అని కొనియాడారు. దళితులు, మహిళలు, కార్మికులు, రైతుల హక్కుల కోసం అంబేద్కర్ చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు.