NZB: జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ఓపెన్ టు ఆల్ హాకీ టోర్నమెంట్లో తూంపల్లి జట్టు ఛాంపియన్షిప్ను గెలుచుకుంది. జాతీయ క్రీడల దినోత్సవం సందర్భంగా పాత కలెక్టరేట్ గ్రౌండ్లో ఈ పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్, విజేతలకు ట్రోఫీలను అందజేశారు.