NLR: సంగం మండలంలోని పడమటిపాలెం మహాలక్ష్మమ్మ ఆలయంలో నూతన విజయ గణపతి, నాగేంద్ర స్వామి, మహాలక్ష్మమ్మ విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రత్యేక పూజలు, హోమాలు, యాగాలను వేద పండితులు నిర్వహించారు. చుట్టుప్రక్కల ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేశారు. అమ్మవారిని దర్శించుకుని ప్రసాదాలను స్వీకరించారు.