కోనసీమ: కొత్తపేట మండలం ఆవిడి గ్రామంలోని శ్రీ పార్వతి కైలాసేశ్వర స్వామి వారి ఆలయంలో నిర్వహించిన లక్షపత్రి పూజా కార్యక్రమంలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పాల్గొన్నారు. ఆయనకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు, తదితరులు పాల్గొన్నారు.