కృష్ణా: ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆదేశాల మేరకు జిల్లాలో నేరాల నివారణ లక్ష్యంగా నిన్న రాత్రి పకడ్బందీగా తనఖీలు నిర్వహించారు. పోలీసు అధికారులు నైట్ రౌండ్స్‌లో భాగంగా బీట్ పాయింట్స్ తనిఖీ చేశారు. బస్సులు, ప్రార్థన మందిరాలు, ఏటిఎంలు, వ్యాపార సముదాయాల వద్ద సిబ్బందిని అప్రమత్తం చేస్తూ ఎటువంటి నేరాలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు.