ATP: జిల్లాలో ఈదురు గాలులతో కూడిన వర్షం అరటి, బొప్పాయి, దానిమ్మ, నేరేడు వంటి పంటలకు తీరని నష్టం మిగిల్చింది. మొత్తం 143 మంది రైతులకు సంబంధించి 353 ఎకరాల్లో రూ.6,63,31,000 నష్టం వాటిల్లింది. పంటనష్టం ప్రాథమికంగా అంచనా వేసి ప్రభుత్వానికి నివేదించామని ఉద్యానశాఖ ఉపసంచాలకులు ఉమాదేవి తెలిపారు.