EG: పెరవలి మండలం ఖండవల్లి, ఉసులుమర్రులో జూదం ఆడుతున్న 14 మందిని అరెస్టు చేసినట్లు ఎస్సై ఎం. వెంకటేశ్వరరావు శనివారం తెలిపారు. వారి వద్ద నుంచి రూ.24,180 స్వాధీనం చేసుకున్నామన్నారు. కేసు నమోదు చేసి సోమవారం కోర్టులో హాజరు పరుస్తామన్నారు. మండలంలో ఎవరైనా అసాంఘిక కార్యక్రమాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.