SKLM: కోటబొమ్మాళి మండలం నిమ్మాడ క్యాంప్ కార్యాలయంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఆదివారం పంపిణీ చేశారు. టెక్కలి మండలానికి చెందిన పి. తులసి లక్ష్మి 64,579/-, ఎం. మహాలక్ష్మి 61,529/-, ఎస్. విమలకుమారి 66,280/-, పి. శివసాయి 50,019/- చొప్పున మొత్తం నలుగురికి 2,42,587/- రూపాయల ఆర్థిక సాయం అందించారు.