GNTR: కాకుమాను మండలం రేటూరులో గురువారం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ‘పొలంబాడి’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ అధికారి సుధాకర్ రైతులకు విత్తన శుద్ధి ప్రాముఖ్యతను వివరించారు. పొలంబాడి ద్వారా సాగు ఖర్చులు తగ్గించుకుని, అధిక దిగుబడులు సాధించే మెలకువలను తెలియజేశారు. విత్తన శుద్ధి చేయడం వల్ల ప్రారంభ దశలోనే చీడపీడలను అరికట్టవచ్చని సూచించారు.