KRNL: ప్రతి పేదవాడికి ఇంటిని నిర్మించి, వారికి అండ కల్పిస్తామని పత్తికొండ MLA కేఈ. శ్యాంబాబు అన్నారు. మండల పరిధిలోని పుచ్చకాయలమడలో నూతన గృహాలను ఆయన ఇవాళ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇళ్లు లేని నిరుపేద ఎవరూ ఉండకూడదన్న ఉద్దేశంతోనే కూటమి ప్రభుత్వం నిర్మించి ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు.