AKP: కోటవురట్ల మండలంలో ఇద్దరికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను హోం మంత్రి అనిత ఆదివారం పంపిణీ చేశారు. అనారోగ్యంతో చికిత్స తీసుకున్న కోటవురట్లకు చెందిన జవ్వాది శ్రీనుకు రూ.30,000, పందూరుకు చెందిన అద్దెపల్లి రాజబాబుకు రూ.57,529 సీఎం రిలీఫ్ ఫండ్ తన సిఫార్సుపై మంజూరైనట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి లాలం కాశీనాయుడు పాల్గొన్నారు.