ATP: ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ అధ్వర్యంలో కోటి సంతకాల ప్రజా ఉద్యమం కొనసాగుతోంది. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆదేశాల మేరకు తాడిపత్రిలోని 22, 23వ వార్డులో ఆదివారం ఈ కార్యక్రమం జరిగింది. కొసినేపల్లి నరసింహారెడ్డి ఆధ్వర్యంలో సంతకాలు సేకరించారు. ప్రైవేటీకరణతో పేద విద్యార్థులకు నష్టం జరుగుతుందని తెలిపారు.